Thursday, May 13, 2021

Latest Posts

ఏపీలో నేటి దృశ్యాలను చూసి షాక్ అయ్యా- చంద్రబాబు నాయుడు

Chandrababu shocked to see todays scenes at liquorshopes in AP

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల గడిచిన కొన్ని రోజులుగా అమ్మకాలు చెయ్యని మద్యం దుకాణాలు ఈరోజు(సోమవారం)నుంచి అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో ఏపీలో కూడా మద్యంషాపులకి వైసీపీ ప్రభుత్వం అనుమతివ్వడంతో లిక్కర్ షాపుల ముందు మందుబాబులు ఎండలను కూడా లెక్క చేయకుండా బారులుదీరుతున్నారు. ఎప్పటి నుండో మందు తాగక పోవడంతో ఒక్కసారిగా అందరూ  మద్యం దుకాణాలు ముందు బారులుతీరారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రతలు చెప్పి మద్యం  దుకాణాలు ఓపెన్ చేసుకోమన్నారు. కానీ  కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా గుమ్మి కూడారు.

ఇవన్నీ చూసిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్కా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయం దారుణమని మండిపడ్డారు. మద్యం దుకాణాలు తీస్తే జనం భారీగా గుమిగూడతారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఇలాంటి  ప్రస్థితులలో  వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా ఈ రోజు ఇలా భారీ సంఖ్యలో జనం క్యూలు కట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణం అని,  కరోనాను దృష్టిలో పెట్టుకొని ఐన కేంద్ర ప్రభుత్వం తెలిపిన కనీస జాగ్రతలు తీసుకోలేదని అన్నారు.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss