ప్రస్తుతం కాకినాడ సముద్ర తీరంలో మడ అడవుల నరికివేతను తప్పుబడుతూ పర్యావరణ ప్రేమికుడైన 19 ఏళ్ల కుర్రాడు చిన్న చిన్న మాటలతో మడ అడవుల విశిష్టతను వాటి గొప్పతనం గురించి వివరించాడు. సంపత్ డంగేటి అనే కుర్రాడు చేసిన ఈ వీడియోను అందరిని ఆలోచింపచేసెల ఉంది. ఆ వీడియోలో సంపత్ 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీతో తమిళనాడు కోస్తా తీరం ప్రాంతంలో దాదాపు సుమారు 7వేల మంది చనిపోయారని కానీ కిచ్చావరం అనే ప్రాంతం మాత్రం సురక్షితంగా బయటపడింది ఇది మడ అడవుల వల్లే ఇది సాధ్యమైంది అని పేర్కొన్నాడు. ఎన్నో తుఫానులు,సునామీల వచ్చిన సమయంలో నీటి ప్రవాహాన్ని మడ అడవులు అడ్డుకున్నాయి అని కానీ గత కొంత కాలంగా వాటిని నరికేశారని వాపోయాడు. కాకినాడకు సహజ రక్షణ కవచాలుగా ఉన్న ఈ అడవులు లాక్ డౌన్ వల్ల పర్యావరణం బాగుందని అందరూ సంతోషిస్తున్న తరుణం లో కానీ ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి చర్యలు వల్ల ప్రమాదకరంగా మారింది అని తెలిపారు. పేద ప్రజల కోసం భూములు సేకరించడంలో తప్పులేదు కానీ ఆ కారణంతో పర్యావరణానికి హాని తలపెట్టొద్దు అని అతను విజ్ఞప్తి చేశాడు.
ఆ బాలుడి వీడియో చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు తన ట్విట్టర్లో షేర్ చేసి మడ అడవుల ప్రాముఖ్యతను చాలా అధ్బుతంగా వివరించిన అబాలుడిని అభినందిస్తూ, ఆ వీడియోను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక పాఠమని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Simple explainer video from an environmentally conscious young man who has a lesson or two to teach the Chief Minister of Andhra Pradesh #SaveMadaForestFromJagan pic.twitter.com/4bWDWx2fyb
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) May 12, 2020
ఇది కూడా చదవండి: టీడీపీ నేత పై మర్డర్ అటెంప్ట్ లో కీలక వ్యక్తి అరెస్ట్