విద్యారంగంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్‌కు మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మూడు స్వయం ప్రభ ఛానెల్స్‌కు అదనంగా 12 ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రతి రోజు డిజిటల్ క్లాస్ లు జరిగే ల చూస్తామని వెల్లడించారు. 1వ తరగతి నుండి 11వ తరగతి వరకు అన్నీ క్లాస్ లను ఆన్లైన్ లో బొదించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఆరోగ్యం, విద్య, వ్యాపారం, వాణిజ్యం, వ్యాపార మోసాల నివారణ, రాష్టాలకు ఆర్ధిక వనరులకు కేటాయింపులు ప్రకటించారు కేంద్రమంత్రి . భూమి, శ్రమ, చట్టాలు ఈ మూడింట్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు శ్రామిక్ రైళ్లు నడుపుతున్నామని, రైళ్లకు అయ్యే ఖర్చులు 85 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రాలు భరిస్తున్నాయని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: ఏ.పీ లో మరో గ్యాస్ లీక్