Thursday, December 2, 2021

Latest Posts

నటి హేమ వాయిస్ క్లిప్ లీక్ – నరేష్ పై సంచలన వ్యాఖ్యలు

Character Artist Hema Voice Clip Leaked

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ మా అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్న నటీనటులు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పంపిన వాయిస్ మెసేజ్ లీక్ కావడంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఇది సంచలనం గా మారింది. ఈ వాయిస్ క్లిప్ లో ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్‌పై సంచలన ఆరోపణలు చేసింది నటి హేమ.

నరేష్ మా ఎన్నికలు జరగకుండా ఆపేస్తున్నాడని, వచ్చే ఏడాది వరకు అధ్యక్ష పదవిలో కొనసాగాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఎన్నికలను వాయిదా వేసేందుకు అతను పరిశ్రమలోని పెద్ద వ్యక్తులతో కూడా మాట్లాడుతున్నాడని హేమ తెలిపింది. అంతే కాకుండా, రూ. 5 కోట్ల నిధులలో కేవలం రూ. 3 కోట్ల నిధులను మాత్రమే లెక్కలు చూపించారని, మిగిలిన నిధులను నరేష్ ఏం చేశారో వెల్లడించాలని హేమ అన్నారు. నరేష్ ప్రజలను మోసం చేస్తున్నాడని హేమ ఆరోపించారు.

మా ఎన్నికల తేదీని ప్రకటించేలా ఒత్తిడి చేయమని, మాలో ఉన్న 200 మంది సభ్యులకు ఈ రోజు ఉదయం హేమ లేఖ రాశారు. మా ఎన్నికలు జరగాలని 200 మంది సభ్యుల సంతకాలను సేకరించి మా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణం రాజుకు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss