Thursday, May 13, 2021

Latest Posts

బ్యూటీ క్వీన్ ఛార్మి బర్త్ డే స్పెషల్

తెలుగు తెరకు గ్లామర్ ను పరిచయం చేసిన కథానాయికలలో ఛార్మీ ఒకరు. అందాల కథానాయికగా కుర్రకారు హృదయాలను దోచుకున్న చార్మీ.. ఆ అందాల ముద్దుగుమ్మ తెలుగులో చాలా సినిమాలు చేసిన శ్రీ అంజనేయంతో చాలా పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో తన అంద చందాలతో అదరగొట్టింది. ఆ తర్వాత హఠాత్తుగా నటనకు కామా పెట్టేసి నిర్మాణం వైపు దృష్టి పెట్టింది.

ఛార్మి 1987 మే 17 వ తేదీన ముంబై సమీపంలోని వసై దగ్గర జన్మించినది. ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. ఒక రోజూ ఆమె స్వస్థలం ముంబైలో కాకతాళీయంగా ఛార్మిని చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి నీతోడు కావాలి అనే తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేసాడు. అది 2001, అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది.

ఆ తర్వాత ఛార్మికి వెంటనే కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. 2007 లో విడుదలయిన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి.మంగళ చిత్రానికి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ వచ్చింది. అంతేకాదు సరిగ్గా 19 సంవత్సరాల క్రితం ఛార్మి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

నీతోడు కావాలి అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు 14 ఏళ్ల వయసులో పరిచయం అయిన హీరోయిన్ ఛార్మి. శ్రీ ఆంజనేయం, గౌరీ, మంత్ర లాంటి సినిమాలతో తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరలేదు. ఆ తరువాత ఐటమ్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరియర్‌ను మలుపు తిప్పుకునే ప్రయత్నం చేసినా ఛార్మి కెరియర్ గాడిన పడలేదు. అయితే ఇన్నేళ్ల గ్లామర్ కెరియర్‌లో ఛార్మి రూమర్స్‌ విషయంలో టాప్ ప్లేస్‌తో పోటీ పడుతూనే ఉంది.

దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ప్రేమాయణం తరువాత.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌తో డేటింగ్‌లో ఉందని.. ఈ ప్రేమపక్షులు ప్రేమలోకంలో విహరిస్తున్నారని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే పెళ్లికి ముందే పెటాకులైంది వీరి ప్రేమవ్యవహారం అంటూ వార్తలు నడిచాయి. అయితే దేవిశ్రీ పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ.. తాను ప్రేమలో విఫలమైనట్టు మీడియాకి వివరించింది.

అంతేకాదు పూరి జగన్నాథ్ తో కలిసి కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అవి జ్యోతిలక్ష్మి, రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ సినిమాల కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఫైటర్ అనే మూవీని నిర్మిస్తున్నారు. ఇలానే తన కెరీర్లో ఇంకా మరెన్నో సినిమాలు తీసి విజయాలు సాధించాలని కోరుకుంటూ 99తెలుగు చానెల్ తరుపున ఛార్మి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss