Sunday, June 20, 2021

Latest Posts

బెల్లం కొండ శ్రీనివాస్ సినిమా స్టార్ట్ కాకుండానే మూడు కోట్ల నష్టం

Chatrapathi Remake Sets Damaged

బెల్లంకొండ శ్రీనివాస్ తొలి బాలీవుడ్  చిత్రం చత్రపతి రీమేక్ ఏప్రిల్ 22 నుంచి సెట్స్ లోకి వెళ్ళాలి. ఇందుకోసం హైదరాబాద్‌లోని 6 ఎకరాల్లో భారీ సెట్ ను రెడీ చేశారు అది కూడా రంగస్థలం షూటింగ్ చేసిన స్థలంలో వేసినట్లు సమాచారం. అయితే అంతా సిద్ధం ఇంక షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు, కరోనా సెకండ్ వేవ్ వారి ప్రణాళికలకు భంగం కలిగించింది.

ఇప్పుడు దురదృష్టవశాత్తూ, ఈ చిత్రం షూటింగ్ కోసం వేసిన భారీ సెట్ హైదరబాద్ లో కురిసిన వర్షాల వల్ల మొత్తం నాశనమయ్యింది. ఇప్పుడు ఈ సెట్ యొక్క ఖర్చు మూడు కోట్లు ఉంటుందని సమాచారం. ఈ సెట్ మొత్తం కూడా ఒక గ్రామీణ కథ నేపథ్యంలో రెడీ చేశారు. ఇప్పుడు తీరా భారీ వర్షాలకి మొత్తం పాడయ్యింది.

సెట్‌ను పునర్నిర్మించడానికి మేకర్స్ భారీ మొత్తాన్ని కేటాయించాలి. వివి వినాయక్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తుండగా, పెన్ స్టూడియోస్‌కు చెందిన జయంతిలాల్ గడా దీనిని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss