Monday, July 26, 2021

Latest Posts

వీడియో కాల్ ద్వారా డెలివరీ

కరోనా కారణంగా ఎక్కడకు వెళ్లలేని దుస్థితి వచ్చింది. ఈ సమయంలో ఆకరికి హాస్పిటల్ కు వెళ్దామన్న బయంగానే ఉంది. ఇలాంటి సమయంలో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. గర్భిణులు చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లాలన్నా భయపడుతున్నారు. మరోవైపు డెలివరీ చేయడానికి డాక్టర్ లు కూడా ఆస్పత్రికి రావటానికి సందేహిస్తున్నారు. ఈ లాంటి సమయంలో గర్భిణులు స్త్రీలు డెలివరీలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాగా ఓ గర్భిణీ డెలివరీ 3 ఇడియట్స్ సినిమాలో వీడియో కాల్ లో డాక్టర్ సూచనలు చేస్తుంటే హీరో డెలివరీ చేసినటుగా కర్నాటకలో కూడా ఆదే తీరులో కొందరు మహిళలు ఓ గర్బినికి డెలివరీ చేశారు. జూలై 26 ఆదివారం హుబ్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే హనగల్‌ అనే ఊళ్లో వాసవి అనే మహిళకు డెలివరీ సమయానికి ముందే పురిటి నొప్పులు రావడంతో భర్త అంబులెన్స్ కు ఫోన్ చేయగా కరోనా ఎఫెక్ట్ తో అంబులెన్స్ లు బిజీగా ఉన్నాయని 45 నిమిషాల సమయం పడుతుందన్నారు. అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువ కావటంతో ఆమె స్నేహితురాలు ప్రియాంక అనే డాక్టర్ కు ఫోన్ చేసి, డాక్టర్ వీడియో కాల్ లో చేసిన సూచనల మేరకు సదరు గర్భిణికి డెలివరీ చేసింది. డెలివరీ అనంతరం అంబులెన్స్ రాగా బిడ్డను, తల్లిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బిడ్డ, తల్లి క్షేమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss