Thursday, December 2, 2021

Latest Posts

కేసులు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్న చైనా

China Fear Of Spreading Delta Variant Corona Cases

కోవిడ్ -19 కేసులు ఆకస్మాత్తుగా పెరగడంతో చైనా ఆందోళన చెందుతుంది. ఇది చైనా అంతటా 18 ప్రావిన్స్‌లలోని 27 నగరాలకు విస్తరించిందని సమాచారం. అధికారిక మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ ప్రకారం, కోవిడ్ 95 ప్రాంతాలకి పాకిందని చెబుతుంది. రాజధాని బీజింగ్‌లో ఆదివారం నమోదయ్యిన కొత్త కేసులకు ‘డెల్టా’ వేరియంట్ కారణమని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గుర్తించింది.

దీనితో బీజింగ్ మునిసిపల్ ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తి చెందుతున్న ప్రావిన్సుల నుండి రాజధానికి అన్ని వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జాంగ్జియాజీలోని గ్రాండ్ థియేటర్‌లో వేసిన ఒక షో కోసం 2000 మంది గుమిగూడడంతో అక్కడ కరోనా కేసులు పెరిగాయని సమాచారం. వారి దగ్గరి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఐసోలేషన్ లో ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss