China is an unreliable country of the world says Britain
కరోనా మహమ్మారిని చైనా వైరస్ అని కూడా పిలవడం తెలిసిందే, ఎందుకంటే? ప్రపంచ దేశాలలో చైనా అవలంబించిన తీరు చాలా అనుమానాస్పదంగా ఉండటం. నవంబర్ లోనే కరోనా వైరస్ గురించి తెలిసిన చైనా, తమ దేశంలో ఇటువంటి సంఘటన జరిగింది, దాని వల్లన ఒక వైరస్ ఆ ప్రాంతంలో చాలా మంది ప్రాణాలను తీసింది అని కానీ బయటకు రానివ్వకుండా దాచి, చైనా విశ్వసనీయతను అనుమానాస్పదంలోకి తానే నెట్టుకుంది.
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చైనా అంటే నమ్మని పరిస్తితి. తాజాగా బ్రిటన్ తమ దేశానికి సంబందించి కంపేరిజన్స్ ఒఫ్ అదర్ కంట్రీస్ లిస్ట్ లోనుండి చైనాను తొలగించింది. దీనికి ప్రధాన కారణం కరోనాను ముందుగా తెలిసిన ప్రపంచానికి చెప్పకపోవడం, ఏకంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడటం అనుమానాస్పదం గా మారింది. కాగా తాజా బ్రిటన్ నిర్ణయం చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. ముందు ముందు రోజుల్లో చైనా ప్రపంచ దేశాల నుంచి ఊహించని దెబ్బలు తగులుతాయి అని విశ్లేశిస్తున్నారు.