Thursday, February 25, 2021

Latest Posts

డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్న చైనా

కరోనా పుట్టుక రహస్యాలు బయటకు పొక్కకుండా చైనా తీవ్రంగా యత్నిస్తోంది. సంక్షోభం తొలి నాళ్లలో తనకు మద్దతుగా నిలిచిన డబల్యూ‌హెచ్‌ఓ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) కు కూడా చుక్కలు చూపిస్తోంది. వైరస్ పుట్టుకపై దర్యాప్తులో భాగంగా చైనాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందానికి చైనా చివరి నిమిషంలో అడ్డంకులు సృష్టిస్తోంది. వారి ప్రయాణం ప్రారంభమైనప్పటికీ.. చైనాలో అడుగుపెట్టేందుకు కావాల్సిన అనుమతులను మాత్రం తిరస్కరిస్తుంది. దీంతో..డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ తీవ్ర అంతృప్తి వ్యక్తం చేశారు.

గత 24 గంటల్లో వివిధ దేశాల శాస్త్రవేత్తలు చైనాకు బయలు దేరారు. అయితే..చైనాలో ప్రవేశించేందుకు కావాల్సిన అనుమతులను అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేయలేదని ఈ రోజు మాకు తెలిసింది అని టెడ్రోస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనకు చైనా ప్రభుత్వం గతంలోనే అంగీకరించిందనీ, ఏయే దేశాల శాస్త్రవేత్తలు రావాలనే దానిపై కూడా అంగీకారం కుదిరిందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అనుమతులు ఇవ్వకపోవటంతో డబల్యూ‌హెచ్‌ఓ కి చుక్కలు కనిపిస్తున్నాయి.

కరోనా మహమ్మారి పుట్టుక తొలినాళ్లలో చైనా తప్పులు చేసిందన్న వాదనను అక్కడి ప్రభుత్వం తొలి నుంచీ తిరస్కరిస్తుంది. అయితే ప్రపంచ దేశాలు మాత్రం చైనా నే ఇందుకు కారణం అని వేలెత్తి చూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పై ఎన్ని విమర్శలు గుప్పించారో మనందరికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss