Chinmayi Sripada collecting money for Corona Charity through singing :
కరోనా కోసం విరాళాలు సేకరించడంలో సినీ ప్రముఖులు ముందు ఉన్నారు. టాలీవుడ్ లో సీసీసీ అనే ట్రస్ట్ పెట్టి పన్నెండు వేల మందికి నిత్యావసరాల వస్తువులు అందిస్తున్న సంగతి తెలిసిందే, కాగా ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ చారిటీ కి విరాళాలు అందించారు. బాలీవుడ్లో “WE ARE ONE” అనే నినాదంతో ఇండియా లో ఉన్న సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందేలా అమితాబ్ చర్యలు తీసుకున్నారు. మన టాలీవుడ్ లో కూడా చిరంజీవి తలపెట్టిన సీసీసీ కార్యక్రమానికి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సినీ హీరోలందరూ తమ విరాళాలను అందించారు. ఈ సమయంలో అదే సినీ పనుల మీద ఆధారపడిన కార్మికులను ఆదుకోవడం ఎంతగానో అవసరం.
కాగా ఇదే కోవలో చిన్మయి శ్రీపాద కూడా తనదయిన శైలిలో విరాళాలను సేకరిస్తుంది. కాగా చిన్మయి శ్రీపాద metoo ఉద్యమంలో ఎంతో లైం లైట్ లోకి వచ్చిన….. ఫైర్ బ్రాండ్ అనే నేమ్ కూడా ఆ టైములో సంపాదించుకుంది. కాగా తానూ తన సింగింగ్ టాలెంట్ తో ఈ చారిటీ చేయాలనుకుంటుంది. దీనికి సింగింగ్ చారిటీ అంటిల్ లొక్డౌన్ అనే నినాదంతో విరాళాలు సేకరిస్తుంది. కాగా ఎవరైనా బర్త్ డే విషెస్ గాని, ఎవరికన్నా సాంగ్ ని డేడికేట్ చెయ్యాలనుకున్న, ఏదైనా విషెస్ చెప్పాలన్న వారు ఎంత అయితే చారిటీ కి డొనేట్ చేద్దామనుకుంటున్నారో ఆ మొత్తం పంపి స్క్రీన్ షాట్ పంపిస్తే, వారి కోసం పాత పాడి వారికి సోషల్ మీడియా ద్వారా సెండ్ చేస్తుంది. ఈ వినూత్న శైలిలో తనదైన ముద్ర ఉంటూ విరాళం సేకరించడం అభినందించాల్సిన విషయం.