Thursday, December 2, 2021

Latest Posts

జగన్ పతనం మొదలయ్యింది అతను మాజీ సి‌ఎం అవుతాడు

Chinta Mohan Shocking Comments On Jagan

చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు ఆరు సార్లు ఎంపీగా చేసిన చింతా మోహన్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఈ నెలలో ఏపీలో అనేక రాజకీయ పరిణామాలను చూస్తుందని అన్నారు. ఆగస్టు 25న జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ పై సిబిఐ కోర్టు తీర్పు వెలువరించనుందని అందులో జగన్ కట కటాల పాలవుతాడని చెప్పారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ పతనం ప్రారంభమైందని రాబోయే రెండు వారాల్లో, జగన్ మాజీ సిఎం అవుతారని చింతా మోహన్ అన్నారు. ఈ కేసు నుండి బయటపడటానికి, ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త మరియు కేంద్ర మంత్రి కుమారుడిని జగన్ సంప్రదించాడని అన్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ నాయకుడు తప్పుపట్టారు. ఏవేవో కారణాలు చెప్పి ఈ కేసును సి‌బి‌ఐ పక్కకి తోస్తుందని, సి‌బి‌ఐ ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉందని చింతా మోహన్ అన్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss