Chintamaneni Prabhakar Father Passed Away
టీడీపీ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి చింతమనేని కేశవరావు గారు మృతి చెందారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన మృతి చెందినట్టు సమాచారం. గతంలో దుగ్గిరాల సర్పంచ్ గా కేశవరావు గారు పని చేశారు. కాగా, కేశవరావు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ లో పరామర్శించి సంతాపం తెలిపారు. నారా లోకేశ్, టి డి పి శ్రేణులు తదితరులు సంతాపం తెలిపారు.