chiranjeevi comments on Corona Crisis charity
కరోనా మహమ్మారి వల్ల దేశం 20రోజుల లాక్ డౌన్లో ఉంది. దీని వల్ల దేశంపై ఆర్దిక భారం బాగా పడింది. ఎవ్వరికీ పనిలేకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అందువల్ల చిన్న మద్య తరగతి కుటుంబాల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వీరిలో భాగంగానే సినీ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అన్న సంగతి తెలిసిందే. ఉపాధి కోల్పోయిన వీరికి నిత్యావసరాలకు సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందువల్ల ఇండస్ట్రీలో ఉండే పెద్దలు దీనిపై స్పందించి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం (సీసీసీ)ని ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ సంస్థ ద్వారా సినీరంగంలో ఉన్న పేద కార్మికులకు సహాయం అందిస్తున్నారు. అయితే ఈ కరోనా మహమ్మారి సమస్య పరిష్కారం తర్వాత కరోనా క్రైసెస్ చారిటీ అనేది ఉండదని తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా క్రైసెస్ చారిటీ అని కాకుండా ‘మనకోసం’ అనే పేరుతో ఈ సంస్థ కంటిన్యూ అవుతుందని తెలిపారు. అలాగే అన్నీ క్రాఫ్ట్లనూ, అసోసియేషన్లనూ కలుపుకొని ఇలాంటి విపత్కర పరిస్థితులలో చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉంటుందని ఇదెలా ముందుకెళ్తుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని తెలిపారు.