Sunday, June 20, 2021

Latest Posts

ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించిన మెగాస్టార్

Chiranjeevi Oxygen Bank Started

ఆక్సిజన్ సరఫరాలో కొరత దృష్ట్యా, మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాలలో ‘ఆక్సిజన్ బ్యాంకులు’ ప్రారంభించటానికి ముందుకు వచ్చారు. ప్రకటించినట్లుగానే, ఆచార్య స్టార్ ఈ రోజు నుండి హైదరాబాద్‌లో తన మిషన్‌ను ప్రారంభించారు. ఈ నాన్ ప్రాఫిటబల్ సంస్థకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెట్టారు.

ప్రస్తుత కరోనావైరస్ పరిస్థితిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల ఎవరూ చనిపోకూడదని చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభిస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే ఈ రోజు, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభిస్తూ ఆకుపచ్చ జెండాను ఊపుతున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక రేపటి నుండి ఖమ్మం, కరీంనగర్ మరియు మరో ఐదు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

ఈ గొప్ప కార్యాచరణను చేపట్టడానికి మెగాస్టార్ రామ్ చరణ్ తో జతకట్టారు. ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలోని ఫ్యాన్ క్లబ్‌లతో కలిసి పని చేయనున్నారు చిరంజీవి రామ్ చరణ్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss