Tuesday, April 13, 2021

Latest Posts

అమ్మకోసం దోశలు వేసిన మెగాస్టార్  

 Chiranjeevi Prepares Pesarattu Upma For His Mother

కరోనా మహమ్మారి లాక్ డౌన్ వేళ అందరి లాగే ఇళ్లకు పరిమితమైన సెలబ్రిటీలు ఇంటి పనుల్లో బిజీ అయ్యారు. స్టార్స్,డైరెక్టర్స్ ఒకరికొకరు ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ మేరకు   మెగాస్టార్ చిరంజీవి `బి ది రియల్ మేన్` ఛాలెంజ్‌ను పూర్తి చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీయార్ విసిరిన ఛాలెంజ్‌ పూర్తి చేసేందుకు మెగాస్టార్ కిచెన్ బాట పట్టారు.  అందరూ భార్యకు సహాయం చేస్తే.. మెగాస్టార్ మాత్రం తన తల్లి కోసం దోశెలు వేశారు. పక్కన కూర్చుని తినిపించారు. అలాగే ఇంటిని శుభ్రం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి బాగా యాక్టివ్ గా ఉంటున్నారు కదా.

అందుకే  ఇందుకు సంబందించిన  వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. `భీమ్ (తారక్) .. ఇదిగో నా వీడియో. నేను రోజూ చేసే పనులే.. ఇవ్వాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం` అని పేర్కొన్నారు. ఇక ఈ ఛాలెంజ్ కోసం తన తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను, తన స్నేహితుడు సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను నామినేట్ చేశారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss