Chiranjeevi Promoted Balakrishna Movie
నటీ నటుల మధ్య పోటీ ఉంటేనే వాళ్ళల్లో నటన బయటకు వస్తుంది. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య పోటీ సహజంగానే ఉంది. ఎన్టీఆర్, అక్కినేని మధ్య నటనలో పోటీ ఉండేది. అయితే ఇద్దరి మధ్యా స్నేహం కూడా అలానే ఉండేది. ఇక ఆతర్వాత చిరంజీవి, బాలకృష్ణ మధ్య గట్టి పోటీ నడిచి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపు వీరిద్దరు బాక్సాఫీస్ దగ్గర 15 సార్లుకు పైగా పోటీ పడిన సందర్భాలున్నాయి. ఇక వీరిద్దరి సినిమాలు మూడేళ్ల క్రితం విడుదలై పోటీ వాతావరణం సృష్టించాయి. గౌతమిపుత్ర శాతకర్ణి, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలతో పోటీ పడ్డారు.అయితే వీళ్లిద్దరు వ్యక్తిగతంగా మంచి స్నేహితులనే విషయాన్ని చిరు, బాలయ్యలు పలు సందర్భాల్లో ప్రకటించారు కూడా.
ఇక బాలకృష్ణ సెంచరీ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ఓపెనింగ్‌కు బాలకృష్ణ..స్వయంగా చిరంజీవిని ఆహ్వానించగా, వెంటనే వచ్చాడు. ఆ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి హాజరై క్లాప్ కొట్టారు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నటించకపోయినా ఒకరి సినిమాకు మరోకరు సహరించకున్నారు. ఆ సినిమా వివరాల్లోకి వెళ్తే, తెలుగులో తెరకెక్కిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఆదిత్య 369 రికార్డులకు ఎక్కింది. బాలయ్య తన సినిమా కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుత పాత్రల్లో నటించారు. అందులో ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో అద్భుతాభినయాన్ని చూపించాడు.
ఇక ఈసినిమాలో బాలకృష్ణ నటన, సింగీతం దర్శకత్వ ప్రతిభ, ఇళయారాజా సంగీతంతో పాటు చిరు ప్రచారం కలిసొచ్చి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అదెలా అంటే, ఈ సినిమా రిలీజైన తర్వాత మరింత పబ్లిసిటీ కల్పించడానికిీ, పిల్లలను , కుటుంబ ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ దూర్‌దర్శన్‌లో యాడ్స్ వేయాలని ప్లాన్ చేసారు.అంతేకాదు ఈసినిమాకు సంబంధించిన చిరంజీవితో ప్రచారం చేయిస్తే.. మంచి రిజల్ట్ ఉంటుందని భావించి ఆయన్ని రిక్వెస్ట్ చేశారట. నిర్మాత అడిగిందే తడవుగా చిరంజీవి ‘ఆదిత్య 369’ సినిమా యాడ్‌లో నటించి ఈ సినిమాకు ప్రచారం కల్పించారు.ఈ యాడ్ దూర్‌దర్శన్‌లో ప్రసారం అయి ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమా థియేటర్స్ వైపు అడుగులు వేయించింది.