Sunday, July 25, 2021

Latest Posts

పవన్ ను టెన్షన్ పెడుతున్న చిరంజీవి రాజ్యసభ సీటు

Chiranjeevi Rajya Sabha Seat

వైఎస్‌ఆర్‌సిపి నుంచి చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతునట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త వెలువడిన తర్వాత అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ వెంటనే చిరంజీవికి కలిసినట్లు తెలుస్తుంది. అలాంటిదేమీ లేదని చిరంజీవి పవన్ కు చెప్పాడని, అలాంటి ప్రతిపాదనతో ఇంతవరకు ఎవరూ తనను సంప్రదించలేదని కూడా చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే వైయస్ఆర్సిపి కనుక ఈ మలుపు తీసుకుని, చిరంజీవి ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే, అప్పుడు పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవిల మధ్య రాజకీయ విభేదన వస్తుంది. నాగబాబు కూడా ఇరువైపులా మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. పవన్‌కళ్యాణ్‌కు మద్దతు ఇచ్చే చిరంజీవి అభిమానులు సందిగ్ధంలో పడతారు. జనసేనకు ఓటు వేయబోయే కాపు ఓట్లు కూడా చీలిపోతాయి. అయితే వైఎస్‌ఆర్‌సిపి నుంచి వచ్చే రాజ్య సభ ప్రతిపాదనను చిరంజీవి అంగీకరిస్తారా? అనేది మెగా ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss