Thursday, December 2, 2021

Latest Posts

‘మా’ సమస్యల పై మొదటి సారి నోరు మెదిపిన చిరంజీవి

Chiranjeevi Responds On MAA Controversy

కొంతకాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) చుట్టూ ఉన్న సమస్యల పై మౌనంగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి తాజాగా స్పందించారు. అతను విజనరీ కమిటీ ఛైర్‌పర్సన్, కృష్ణం రాజుకు మా సమస్యల పై స్పందిస్తూ ఒక లేఖ రాశారు. మా ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని కోరారు. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా మే జరగాల్సిన ఎన్నికలు ఇంకా జరగలేదని నాకు తెలుసు అయితే ఎన్నికలు ఇంకా జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు ప్రమాదంలో పడతాయని అందువల్ల వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కృష్ణం రాజును కోరారు.

అలానే మా లో జరుగుతున్న మాటల దాడి ఆగాలని మరియు ఒకరి పై ఒకరు బురద జల్లుకోవడం బాగోలేదని ఆయన తెలిపారు. దీనివల్ల మా ప్రతిష్ట మసకబారుతున్నందున, ఎవరూ మీడియా ముందుకు వెళ్ళి ఈ విషయం పై మాట్లాడవద్దని మా సభ్యులను కోరారు. ఎవరైతే మా ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారో వారి పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చిరంజీవి సూచించారు.

ఇంతకుముందు, నటి హేమ, మా అసోసియేషన్ డబ్బును ఉపయోగించడంలో తప్పులు దొర్లుతున్నాయని, వాటిని నరేష్ ఇష్టం వచ్చినట్లుగా వాడుతున్నారని హేమ నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే నరేష్ ప్రెస్‌తో మాట్లాడి, ఈ ఆరోపణలను ఖండించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై హేమ చేసిన ఆరోపణలను ‘మా’ కార్యదర్శి జీవిత రాజశేఖర్ కూడా ఖండించారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss