Chiranjeevi Reveals Acharya Temple Set
దర్శక నిర్మాతలు సహజంగా తమ చిత్రాలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని దాచి పెట్టి, తగిన సమయంలో రివీల్ చేయాలనుకుంటారు. హీరోలు, హీరోయిన్లు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని తమ వైపు నుంచి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ చిరంజీవి మాత్రం ‘ఆచార్య’ విషయంలో అస్సలు సీక్రెట్ మెయింటైన్ చేయడం లేదు. ఈ సినిమా టైటిల్‌ను కూడా చిరంజీవి చాలా సింపుల్‌గా ఏదో ఒక చిన్న సినిమా ఆడియో ఫంక్షన్లో రివీల్ చేసేసారు.
The amazing #TempleTown set built for #Acharya is a real piece of Art. Couldn’t stop sharing it with you all. pic.twitter.com/P4psg5TDVn
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 6, 2021
తాజాగా ఆ సినిమాలోని టెంపుల్ సెట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. గతంలో చిరంజీవికి సోషల్ మీడియాతో సంబంధం ఉండేది కాదు. అందుకని అలాంటివి ఏమైనా తీసుకున్నా కానీ బయటకు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవి యాక్టివ్ అవడంతో ఆ టెంపుల్ సెట్ బయటకు వచ్చేసింది. ఇది ఇలా లీక్ అవడం కొరటాలకు ఇష్టం లేకపోయినా కానీ మెగాస్టార్ స్వయంగా లీక్ చేసాక ఇక చెప్పడానికేముంటుంది. ఇదిలావుంటే చిరంజీవి ఇలా లీక్ చేయడం చూసి సినిమాలోని ట్విస్టులు కూడా చెప్పేయమంటూ కొందరు చలాకీ కుర్రాళ్లు సరదా ట్రోల్స్ కూడా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: