మెగా స్టార్ చిరంజీవి ఒక వికలాంగ మహిళకు తానే అన్నం తినిపించిన ఒడిస్సా పోలీసు శుభశ్రీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కాగా సదరు మహిళ ఒడిస్సాలో పోలీసు ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక వికలాంగ మహిళ రోడ్డు పక్కన ఉండగా, ఆ మహిళ ఆకలి చూసిన శుభశ్రీ గారు తన చేతితో తానే అన్నం కలిపి తినిపించారు. ఈ సమాజంలో ప్రస్తుత రోజుల్లో ఒకరిని ముట్టుకోవాలంటేనే భయంగా ఉండగా, తాను ఆకలికి మించిన శత్రువు ఉండదని గ్రహించి అన్నం పెట్టిన తీరు యావత్ భారతదేశానికి స్పూర్తి నిచ్చింది. కాగా ఆ మహిళా పోలీసును మెగా స్టార్ చిరంజీవి వీడియో కాల్ ద్వారా మాట్లాడటం జరిగింది. ఆ వీడియో చూసినపుడు నాకు కళ్ళు చమ్మగిల్లాయని, మీరు ఆ మహిళ ఆకలి తీర్చిన తీరు స్పూర్తి దాయకమని కొనియాడారు. కాగా పోలీసు అధికారి శుభశ్రీ ప్రతిస్పందిస్తూ ధన్యవాదాలు తెలిపి, మీరు టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడూ చేసిన అభివృద్ది పనుల గురించి నేను తెలుసుకున్నానని, మీ సామాజిక సేవా స్పూర్తి నాకు ఆదర్శంగా నిలుస్తుంది అని చిరంజీవికి కృతజ్ఞ్యతలు తెలియచేసింది.