Monday, July 26, 2021

Latest Posts

అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా కన్నుమూత

కన్నడ సినీ పరిశ్రమలో 2009లో ‘వాయుపుత్ర’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు చిరంజీవి సర్జా(39) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన ఆదివారం కన్నుమూశారు. జూన్ 6న చిరంజీవికి శ్వాసకోశ సమస్య రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న చిరంజీవి తీవ్ర ఛాతీ నొప్పి కూడా వచ్చిందని, అందుకే మరణించినట్లు తెలుస్తోంది.

1980 అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి బెంగళూరులో విద్యాబ్యాసం పూర్తి చేసుకున్నాక,  తొలి నాళ్లలో అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశారు. నాలుగేళ్ల పాటు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశాక నటుడిగా మారారు. చిరంజీవి దాదాపు 20 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ‘రాజామార్తాండ’కు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా  మరో మూడు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. 2018లో నటి మేఘనా రాజ్‌ని చిరంజీవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  కన్నడ నటుడు అర్జున్‌కు చిరంజీవి సర్జా బంధువు, మరో నటుడు ధ్రువ సర్జాకు సోదరుడు.  కానీ చిన్న వయస్సులో చిరంజీవి మరణించడంతో కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణంపై పలువురు  సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss