Thursday, April 15, 2021

Latest Posts

చిరంజీవి సైరా మూవీ రివ్యూ…

Chiranjeevi Sye Raa Movie Review And Rating

నటీనటులు : చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, తమన్నా, అనుష్క, సుదీప్, విజయ్ సేతుపతి రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, పృథ్వీ, బ్రహ్మాజీ తదితరులు
దర్శకుడు : సురేందర్ రెడ్డి
సంగీతం: అమిత్ త్రివేది, జూలియస్ ఫాఖియం
నిర్మాత : రాంచరణ్
సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు
మాటలు : బుర్ర సాయిమాధవ్
స్టోరీ : పరుచూరి బ్రదర్స్
విడుదల తేదీ: 02.10.2019

తెలుగు వాళ్ళు గర్వపడేలా స్వాతంత్ర సమర యోధుడు అయినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ సినిమాను సురేందర్రెడ్డి దర్శకత్వంలో, రామ్ చరణ్ సారధ్యంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా వచ్చేసింది. ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి థియేటర్లలో సందడి చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందొ ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికొస్తే,

స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ దొరలు తెలుగు ప్రజలపై పడి.. వారి సొంత భూములలో చాకిరి చేయిస్తూ.. వారికి రావాల్సిన సొమ్ముని అన్యాయంగా స్వాధీనం చేసుకుని.. అష్టకష్టాలు పెడుతున్న రోజులవి. అడ్డం తిరిగిన ప్రజల్ని జాలి, దయ లేకుండా ప్రాణాలు తీస్తున్న రోజులవి..! అలాంటి పరిస్థితుల్లో జమిందారీ అయిన ‘సైరా నరసింహా రెడ్డి’ వారికి ఎలా ఎదురు తిరిగి నిలిచాడు.? వారిని ఎదుర్కొనడానికి ‘సైరా’ వేసిన ఎత్తుగడలు ఏమిటి? మధ్యలో ‘సైరాకి’ సాయం చేసిన వీరులు ఎవరు..? చివరికి ‘సైరా నరసింహా రెడ్డి’ ని ఉరి తీసారా? లేదా..? ఇదే అసలు కథాంశం.

నటీనటులు :

సైరాలో మెగాస్టార్‌ చిరంజీవి కన్నా ఉయ్యాలవాడ నరసింహారెడ్డే కనిపించాడు. ఇమేజ్‌ జోలికి పోకుండా పాత్రలో ఉన్నగంభీరం ఎక్కడా మిస్‌ కాకుండా చిరంజీవీ అద్భుతంగా నటించారు. యాక్షన్‌ సీన్స్‌లో అయితే మెగాస్టార్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సినిమా అంతా భారీ తారాగణంతో, ప్రతీ సీన్‌ నిండుగా ఉన్నా.. కళ్లన్నీ నరసింహారెడ్డి మీదే ఉండేలా నటించారు. సినిమా అంతా తన భుజాలమీదే మోశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే సీన్స్లో చిరు యాక్షన్ అదుర్స్ అనిపిస్తుంది. వావ్‌ అనిపించే పోరాట సన్నివేశాలను కూడా అవలీలగా చేసేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఈ సినిమా రూపురేఖలే మారిపోయాయి. ప్రతీ ఒక్కరూ తలెత్తుకునేలా చేసే సన్నివేశమది. మరణం కాదు ఇది జననం.. అంటూ చిరు పలికే సంభాషణలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.

సాంకేతిక నిపుణులు :

సైరాను అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా మలచడంలోను, అలాగే కథను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువ చేసే విధంగా రాసుకొన్న కథనం, కథలో ట్విస్టులను జొప్పించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీరారాడ్డి కొడుకు ఎపిసోడ్, తమన్నా ప్రాణత్యాగం, అలాగే రైతులకు సంబంధించిన సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా చేశారు. యాక్షన్, ఎమోషన్స్, సెంటిమెంట్ అంశాలను కలబోసి తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచేలా సైరాను రూపొందించారడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మొదటి సీన్‌ నుంచి చివరి వరకు తాను రాసుకున్న కథనం ఆకట్టుకుంటుంది.సాయి మాధవ్‌ బుర్రా రాశాడు. సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. అమిత్‌ త్రివేది అందించిన పాటలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఉన్నవి రెండు పాటలే అయినా.. వాటిని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ముగ్దులు కావాల్సిందే. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. నిర్మాణంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాడు. దానికి తగ్గ ఫలితం వెండితెరపై కనబడుతుంది. ఎడిటింగ్‌, క్యాస్టూమ్‌, ఆర్ట్‌ ఇలా అన్ని విభాగాలు సినిమాను విజయవంతం చేయడంలో సహాయపడ్డాయి.

ప్లస్ పాయింట్స్ :

చిరంజీవి

సురేందర్ రెడ్డి డైరెక్షన్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మేకప్ అండ్ క్యాస్టూమ్స్

మైనస్ పాయింట్స్ :

తెలిసిన కథ

దర్శకుడు ఎదో కొత్త ప్రయోగంగా కథకు మసి పూసి మారేడు కాయ చేసాడు. ఎంత చేసిన కూడా రాగి బంగారం ఎవ్వడు కదా.. పేస్టుహం సైరా పరిస్థితి కూడా ఇదేనట. ఈ సినిమా గురించి మెగా అభిమానులు చాలా అసలు పెట్టుకున్నారు కానీ, ఆ ఆశలపై సురేందర్ రెడ్డి నీళ్లు వేసాడు. ఈ విదంగా చేయడం ఇది రెండో సారి మొన్న రిలీజ్ అయినా సాహో కూడా ఇంతే.. ఇప్పుడు సైరా కూడా ఇంతే.. నెక్స్ట్ ఇంకా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

రేటింగ్ : 3.5/5

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss