Tuesday, April 13, 2021

Latest Posts

పుష్ప టీజర్ పై స్పందించిన చిరు

Chiranjeevi Tweets On Pushpa Teaser
అల్లు అర్జున్, సుకుమార్ మూడవ సారి జత కట్టి తీస్తున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి రెండు సినిమాలు భారీ హిట్లుగా నిలిచాయి. దీనితో ఈ సినిమా పై ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ కాంబినేషన్ కి జోడీగా మరో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తుంది. నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక అల్లు అర్జున్‌ పుట్టిన రోజు (ఏప్రిల్‌ 8) పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లో ‘పుష్ప’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బన్నీ పాత్రను హైలైట్ చేస్తూ ఫుల్ మాస్ యాక్షన్ తో నిండిపోయిన ఈ టీజర్ యూ ట్యూబ్ లో దూసుకు పోతుంది. ఇక ఈ పుష్ప టీజర్ చేసిన మెగాస్టార్‌ చిరంజీవి సైతం అభినందించారు. అతని అభినందనలని ట్విటర్ లో తెలిపారు. ‘పుష్ప టీజర్‌ చూశాను. చాలా రియలిస్టిక్ అండ్ రస్టిక్ గా ఉంది. అలాగే పుష్పరాజ్ గా అల్లు అర్జున్‌ ‘తగ్గేదే లే” .. అంటూ ట్వీట్ చేశారు. బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా అందజేశారు.

ఇక అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం.. ఆగస్ట్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss