Tuesday, May 18, 2021

Latest Posts

మీరు ఎప్పుడు చూడని చిరంజీవి డాన్స్

Chiranjeevi words about his dance during International Dance Day :

మెగా స్టార్ చిరంజీవి తన ట్విటర్ అక్కౌంట్ ద్వారా అభిమానులకు సర్ప్రైస్ ఇవ్వబోతున్నారు. “ఇవ్వాళ నేను మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. ఈ రోజు ఏప్రిల్ 29 కాగా ఇంటర్నేషనల్ డాన్స్ డే కావడం విశేషం. డాన్స్ కు నాకు ఉన్న అనుబంధం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డాన్స్ నా సినీ జీవితంలో ఒక అంతర్భాగమయిపోయింది. ఆ డాన్స్ నాకు కోట్లాది మండి అభిమానులను నాకు చేరువ చేసి, వారి గుండెలో సుస్థిర స్థానం గెలుచుకోవడానికి దోహదపడింది అని నేను ప్రఘాడంగా నమ్ముతాను. నా జీవితంలో కూడా డాన్స్ కు ఒక ముఖ్య పాత్ర ఉంది. నేను ఎప్పుడు డిప్రెషన్ లో ఉన్న సరే నేను ఒక గదిలోకి వెళ్ళి నాకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తాను. నాకు అది ఒక మెడిటేషన్ లాగా కొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నాలో కలిగిస్తుంది. అది నాకు ఎంతో జోష్ ని ఇస్తుంది. రిఫ్రెష్ అయ్యి నా తడుపరి పనులు చెయ్యడానికి బోలెడంత ఉత్సాహాన్ని ఇస్తుంది.

దీని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు  ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఈ లోక్ డౌన్ పీరియడ్ లో ఇంటికే పరిమితం అయిపోయి ఒక అయోమయ పరిస్తితి ఉన్న సమయంలో అందరం డిప్రెస్స్ అయ్యి ఉంటారు కాబట్టి, ఇలాంటి పరిస్తితులలో ఇవన్నీ మర్చిపోయి మునుపటి ఉత్సాహాన్ని మేల్కొలపాలంటే ఈ రోజు మీరు మీ ఇళ్ళలో సరదాగా మ్యూజిక్ కు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మీరు కూడా రిఫ్రెష్ అవ్వండి, తోటి మిత్రులకు, కుటుంబ సభ్యులకు పంపి వారిని కూడా మోటివేట్ చేయండి. నేను కూడా ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకి నా ట్విటర్ ద్వారా ఈ మద్య కాలంలో నేను చేసినటువంటి కొన్ని డాన్స్ బిట్స్ నేను షేర్ చేసుకుందామనుకుంటున్నాను. అవి మీరు చూసి ఆనందిస్తారు అనుకుంటున్నాను.” అని తన ట్విటర్లో వీడియో ద్వారా పంచుకున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss