Chiranjeevi’s landmark film Gharana Mogudu celebrates 28 years
మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ఘరానామొగుడు’ ఈ చిత్రం 1992 ఏప్రిల్ 9న విడుదలైంది. అప్పట్లోనే అత్యాదిక షేర్ వసూలు చేసిన సినిమాగా పేరుతెచ్చుకుంది. గురువారం నాటికి ఈ సినిమా విడుదలై 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
దానిని పురస్కరించుకొని రాఘవేంద్రరావు ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు.‘‘కాలం పరిగెడుతోంది.. కానీ, నా బాబాయ్(చిరంజీవి)తో ఈ సినిమా కోసం చేసిన షూటింగ్ మెమరీస్ మాత్రం ఇప్పటికీ నా మైండ్‌లో ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇది మెగా స్పెషల్ ఫిలిం. మైలురాయి లాంటి చిత్రం. ‘ఘరానామొగుడు’ విడుదలై 28 ఏళ్లు పూర్తయింది. నా నిర్మాత దివంగత దేవీ వరప్రసాద్, చిత్ర బృందానికి కృతజ్ఞతలు’’ అని తెలిపుతూ అప్పటి షూటింగ్ సమయంలో చిరంజీవితో ఉన్న ఫొటోను, ‘ఘరానామొగుడు’ పోస్టర్‌ను ట్వీట్లో పొందుపరిచారు.
రాఘవేంద్రరావు ట్వీట్‌కు చిరంజీవి గారు ట్విటర్ ద్వారా తన స్పందనను తెలిపారు ‘‘ఈ మ్యాజిక్ ఘనత మీది సార్. ఈ చిత్రం సృష్టించిన రికార్డ్స్ కంటే, మీతో పనిచేసిన ప్రతి రోజూ ఓ మంచి జ్ఞాపకం. నటీనటులను పువ్వుల్లో (ఒక్కోసారి పళ్లలో) పెట్టి చూసుకుంటూ, మంచి నటనను రాబట్టుకున్న ఘరానా దర్శకుడు మీరు, కీరవాణి గారు, నిర్మాత దేవీ వరప్రసాద్ గారు ఈ విజయానికి మూలస్థంబాలు’’
తన అభిమానాన్ని చాటుకున్నారు.కాగా, ‘ఘరానామొగుడు’ సినిమా లో కార్మికుల సంఘం నాయకుడిగా చిరంజీవి నటన, కంపెనీ యజమానిగా నగ్మ పొగరు సినిమాకు హైలైట్. ఈ సినిమాలో యం.యం.కీరవాణి అందించిన అన్ని పాటలు సూపర్ హిట్. ఇంకా సినిమాలో వాణి విశ్వనాథ్, రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, శరత్ సక్సేనా, రమాప్రభ, ఆహుతి ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.