Saturday, May 15, 2021

Latest Posts

శ్రీకాంత్ వేదన చూసి చలించిన మెగాస్టార్

ప్రముఖ హీరో శ్రీకాంత్‌ను మెగాస్టార్‌ చిరంజీవి సోమవారం పరామర్శించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వరరావు ఆదివారం రాత్రి మరణించడంతో  పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మెగాస్టార్‌ చిరంజీవి సోమవారం శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శ్రీకాంత్‌ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీకాంత్ దుఃఖాన్ని ఆపుకోలేక పోవడంతో చిరంజీవి చలించిపోయారు.

శ్రీకాంత్‌కు తండ్రి మేక పరమేశ్వరరావు  ఆదివారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారి పాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటక లోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య  ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.

పరమేశ్వరరావు గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఈయన కన్నుమూయడంతో సోమవారం  మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు శ్రీకాంత్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు కూడా పరామర్శించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss