Sunday, June 20, 2021

Latest Posts

అమాయకత్వంతో నిండిపోయిన సినిమా బండి

Cinema Bandi Trailer

డైరెక్టర్లు రాజ్ మరియు డికె కలిసి నిర్మిస్తున్న చిత్రం సినిమా బండి. ఈ సినిమా మే 14 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంతో కొత్త దర్శకుడు ప్రవీణ్ కంద్రెగుల పరిచయం అవుతున్నారు. అందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను ఇప్పుడు విడుదల చేశారు.

ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే ఆటోలో ఒక కెమెరా ను మర్చిపోయి వెళతారు. తరువాత డ్రైవర్ దానిని తన గ్రామంలోని తన స్నేహితుల వద్దకు తీసుకువెళతాడు మరియు అది ఎలా ఉపయోగించాలో తెలుసుకుని దానితో సినిమా చేయాలనుకుంటారు. తరువాత వారు సినిమా చేశారా అది ఎలా వచ్చింది అనేది సినిమాలో చూడాల్సిందే.

ఇక ట్రైలర్ మొత్తం కూడా ఒక మంచి పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కించారు. ట్రైలర్‌ చూస్తున్నంత సేపు వారి అమాయకత్వం మిమ్మల్ని నవ్విస్తుంది. మొత్తంగా ఈ సినిమా చూస్తే మిమ్మల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్ళేలా కనిపిస్తుంది.

Watch Cinema Bandi Trailer:

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss