దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మ దినం రోజున రైతులందరికి బాసటగా ఉండటానికి వైఎస్ఆర్ రైతు భరోసాను ప్రారంబించమని ముఖాయమంత్రి జగన్ రైతులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అక్టోబర్ 15 నుంచి ప్రతి రైతుకు ఏడాదికి 12,500 రూ. ల చొప్పున ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. కాగా ఈ సొమ్మును నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్ కి జమ చేయనున్నట్టు తెలియచేసారు.
ఈ భరోసా వలన రాష్ట్రంలో మొత్తం 49 లక్షల రైతులు లబ్ది దారులు కాబోతున్నారని వీరిలో 15.36 లక్షల మంది కౌలు రైతులు కూడా ఉన్నారని తెలియచేసారు. కాగా ఈ పంట పెట్టుబడి సాయం 8750 వేల కోట్లు విడుదల చెయ్యనున్నట్టు జగన్ తెలిపారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్ లో నేరుగా పడడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపిలో అమలుకానున్న లాక్ డౌన్ కొత్త రూల్స్