Saturday, May 15, 2021

Latest Posts

విశాఖ భాదితులకు ఈ రోజు ఇవ్వనున్న నష్ట పరిహారం ?

వరుసగా జరుగుతున్న ఘోర మైన సంఘటనలలో విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ మరచిపోలేని ఒక సంఘటన, ఎంతో మంది ఈ లీక్ అయిన గ్యాస్ వలన అస్వస్థతకు గురి అయ్యారు. కొంత మంది ప్రాణాలు విడిచారు. కాగా చనిపోయిన వారికి కోటి రూపాయలు నష్ట పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి, చనిపోయిన మూగ జీవాలకు కూడా ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వనుంది.   సి‌ఎం జగన్ విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు త్వరగా నష్ట పరిహారం ఇవ్వమని అధికారులను ఆదేశించారు.

విశాఖలో గ్యాస్ లీక్ అనంతరం తీసుకుంటున్న పరిణామాలపై సి‌ఎం జగన్ సమీక్షించారు. బాదితులు  పరిస్థితి, చికిత్స ను సి‌ఎం జగన్ కు అధికారులు వివరించారు. గాలిలో గ్యాస్ పరిమాణం రక్షిత స్థాయికి చేరిందని తెలిపారు. కంపెనీ సమీప గ్రామాల్లో స్టరైన్ గ్యాస్ అవశేషాలను తొలగింపులకు తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ముమ్మరంగా శానిటేషన్ జరపాలని ఆదేశించారు జగన్. అన్నీ చర్యలు తీసుకున్నాకే గ్రామస్తులను వారి ఇళ్లకు అనుమతించవలసిందిగా ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ఇలాంటి పరిస్థితులలో ఆందోళనలు వద్దు సహాయం మిన్న – పవన్ కల్యాణ్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss