Wednesday, April 21, 2021

Latest Posts

మద్యం ధర పెంచడానికి ఇదీ కారణం | సి‌ఎం జగన్

Jagan Clarifies The Liquor Rates

ఏ‌పి సి‌ఎం జగన్ రెడ్డి మద్యం ధర పెంచడం పట్ల ప్రభుత్వ ఆలోచనను స్పష్టం చేశారు. కాగా మొన్నటి నుంచి మద్యం అమ్మకాలు మొదలయిన సంగతి తెలిసిందే, 50 రోజుల నుంచి మద్యం షాపులు లేకపోవడం వలన, నిన్న మద్యం దుకాణాల ముందు జనాలు బారులు తీరారు. కాగా ఏ మాత్రం భౌతిక  దూరం పాటించకుండా మద్యాన్ని విక్రయించారు. కాగా మొన్న 50 శాతం రేట్ అధికంగా అమ్మిన మద్యం విక్రయాలు, నిన్నటి రోజు మాత్రం 75 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే అంశం.

కాగా దీని పై వివరణ ఇస్తూ, ఏ‌పి సి‌ఎం జగన్ రెడ్డి ” మద్యాన్ని నిషేదించడానికి ప్రభుత్వం దశల వారీగా పనులు చేపడుతుందని, ఇప్పటికే 20 శాతం మద్యం దుకాణాలను మూసివెయ్యడం జరిగింది అని, అయితే 13 శాతం మద్యం దుకాణాలను సైతం మూసే ఆలోచనలో ఉన్నామని, కాగా దుకాణాలు తెరవగానే బారులు తీరిన జనం చూసి మద్యం రాటును 75 శాతం పెంచామని, డిల్లీ ప్రభుత్వం కూడా 70 శాతం మద్యం రేటును విక్రయాలను తగ్గించేందుకు చేసిందని, మేము కూడా ఇదే యోచనను అమలు చేశామని తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss