Monday, May 10, 2021

Latest Posts

ఏపీలో కరోనా హెల్ప్ డెస్క్ – ఎలాగో తెలుసా

CM Jaganmohan reddy inaugurates Covid19 help desk in AP

కరోనా మహమ్మారి విజృంభించడంతో అన్ని రాష్ట్రాల్లో చర్యలు ముమ్మరం చేసారు. మరోవైపు లాక్ డౌన్ పొడిగింపు దిశగా అడుగులు వేస్తున్నారు. తాజగా ఎపి ప్రభుత్వం సోషల్ మీడియా యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 పూర్తి సమాచారం తెలుసుకునేలా ప్రభుత్వం హెల్ప్ డెస్క్‌ ప్రారంభించింది.
వదంతులకు తావు లేకుండా ఖచ్చితమైన సమాచారం కోసం సోషల్ మీడియా వేదికను తయారు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం ఈ హెల్ప్ డెస్క్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పొందే అవకాశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వాట్సాప్‌లో 8297104104 నంబర్‌ను కాంటాక్ట్ లిస్టులో పొందుపరచడం ద్వారా సమాచారం పొందవచ్చు. వాట్సాప్‌లో 8297104104 నంబర్‌కు ‘Hi/హాయ్’ అని టైప్ చేసి మెసేజ్ సెండ్ చేయగానే అందరికీ అందుబాటులోకి కరోనా (కొవిడ్-19) సమాచారం పోందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఫేస్‌బుక్‌లో ‘ఆరోగ్య ఆంధ్ర’ మెసెంజర్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss