Saturday, January 16, 2021

Latest Posts

ప్రభుత్వం చెప్పిన పంటనే పండించాలి – కే‌సి‌ఆర్

ఈ రోజు జరిగిన క్యాబినెట్ మీటింగులో రాష్ట్రాలలో పండించే పంటల గురించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు సిఎం కే‌సి‌ఆర్. ప్రభుత్వం సూచించిన పంటలు మాత్రమే వేయాలని అప్పుడే వారికి రైతు బంధు పధకం వర్తిస్తుందని అలా కాకుండా వారికి నచ్చిన పంటను పండిస్తే వారికి రైతు బంధు వర్తించదని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి, కంది ఎంత పండించినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇస్తూ కందికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని 15 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని, డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతులకు లాభం చేకూరుతుందని సిఎం తెలిపారు.

ఇక రెండు మూడు రోజుల్లో స్వయంగా తానే రైతులకు సూచనలు చేయాలని భావిస్తున్నట్లు, అందుకోసం ఏదో ఒక ఛానల్‌లో లైవ్ ఇంటరాక్షన్‌కు రెడీ అవుతానని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణలోని రైతులందరికీ అప్పుల్లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని కేసీఆర్ ఈ సందర్బంగా అన్నారు. వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న వేయొద్దని కావాలంటే యాసంగిలో ఈ పంటను పండించాలని, ఎంత పండించాలన్నది ప్రభుత్వం చెబుతుందని ఆయన వివరించారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో లాక్ డౌన్ 4 సడలింపులు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss