Friday, March 5, 2021

Latest Posts

నేడు సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో భాగంగా పలు విషయాలపై కీలకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల తెలంగాణకు జరిగిన ఆర్థిక నష్టంపై సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టారు.. కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై, సవరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సీఎస్‌, ఆర్థికశాఖ అధికారులు, అన్నిశాఖల కార్యదర్శులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులతో సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.దీంతో పాటు 2020-21 బడ్జెట్‌పై కూడా కేసీఆర్‌ మధ్యంతర సమీక్ష జరపనున్నారు. మరియు యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై ఈ సమీక్షలో ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss