సిఎం కేసిఆర్ ప్రస్తుత లాక్ డౌన్ మరియు కరోనా పరిస్తితులపై కీలక నిర్ణయం ఈ రోజు తీసుకొనున్నారు. ఈ మేరకు ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పరిస్తితుల ధ్రష్ట్యా ఇప్పటికీ కొన్ని సడలింపులను తీసుకునే ఆలోచనలో సిఎం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సమీక్షలో సిఎం కేసిఆర్ రైతులతో నేరుగా సిఎం వీడియొ కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంపై సిఎం కేసిఆర్ ఈరోజు చర్చించనున్నారు.
మే నెల అంతా తెలంగానా లో లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు మరి కొన్ని మాగ్రాదర్శకాలను సరలించనుంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని ఆంక్షలను ఎత్తివేసింది. 5 వ తేదీన జరిగిన మంత్రి మండలి సమావేశంలో కొన్ని సరలింపులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరలించిన అంశాలతో పాటు మరి కొన్ని సరలింపుల కోసం ఈ రోజు చర్చించనున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్యాకేజ్ కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం