Sunday, March 7, 2021

Latest Posts

పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన కే.సి.ఆర్

CM KCR hosted party flag on occasion of TRS party formation day

ఏప్రిల్ 27వ తేదీన  సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.యెస్) ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను అత్యంత నిరాడంబరంగా జరుపుకోవాలని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పార్టీ వర్గాలకు సూచించారు. కరోన వ్యాప్తి దృష్ట్యా మరియు లాక్ డౌన్ ను నిబందనలు అతిక్రమించకుండా ఈ నిర్ణయం తీసుకుంటునట్లు తెలుస్తుంది.  అలాగే  టిఆర్ఎస్ పార్టీ వర్గాలు ఎవరికి వారు తమ ఇళ్ల కే పరిమితమై పార్టీ జెండాను ఆవిష్కరించాలి అని తెలిపారు.అలాగే  పార్టీ జెండాను ఆవిష్కరించే క్రమములో సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

లాక్ డౌన్ ను ఎవరు అతిక్రమించొద్దని ఎవరి ఇళ్ళలో వారే  ఉంటూ ఇళ్లపై పార్టీ పతాకాన్ని ఎగుర వేయాలని కేసిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా ఎక్కడికక్కడే పతాకావిష్కరణ చేయాలని తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకునందున తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను టిఆర్ఎస్ పార్టీ సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9.30 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss