CM KCR Press Meet on Coronavirus
దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఒక్కరోజే 5 పాజిటివ్ కేస్ లు నమోదు కావటం తో మొత్తం తెలంగాణ లో కరోన పాజిటివ్ కేస్ లు 26 కి చేరాయి. 1897 యాక్ట్ కింద మార్చ్ 31 వరకు తెలంగాణ పూర్తిగా లాక్ డౌన్ చేయాలని సిఎం కేసిఆర్ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించటం జరిగింది. ఎవరిని మార్చ్ 31 వరకు అవసరం లేకుండా బయటకి రావద్దని సూచించారు.
అయితే నిత్యవసర అవసరాల కొరకు కుటుంబం నుంచి ఒక్కరినే బయటకి అనుమతి ఇవ్వాలని కూడా సూచించారు. అయితే బయటకి వచ్చిన వారు కనీసం 3 మీటర్లు దూరం పాటించాలను సూచించారు. అత్యవసర ప్రభుత్వ కార్యాలయాలు మినహా అన్నీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించటం జరిగింది. అయితే లాక్ డౌన్ సమయం లో ఉద్యోగులకి వేతనాలను పూర్తిగా చెల్లించాలని సూచించటం జరిగింది. దీనికి సంబంధించిన జి.ఓ ని కూడా త్వరలో విడుదల చేయటం జరుగుతుందని ఈ సందర్భం గా సిఎం కేసిఆర్ చెప్పారు.