హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వర్షం, వరదల వల్ల తీవ్రంగా నష్టం జరిగిందని. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని, తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై చర్చజరుతుంది. వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు కాగా తక్షణ సహాయం, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు.
ఇది కూడా చూడండి: