కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పొడిగించాలని మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల సిఎంలు ప్రధాని నరేంద్రమోదీని కోరారు.
‘‘ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించ వద్దు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం సాధ్యం కాదు. దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేలా లేదు. దానితో కలిసి బతకడం తప్పదు’’ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియచేసారు. ‘‘లాక్డౌన్ సడలింపులు, కంటైన్మెంట్ వ్యూహాలపై పూర్తిగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. కంటైన్మెంట్ కారణంగా ఆర్థికలావాదేవీలకు ఇబ్బంది నెలకొంది. దీనిలో మార్పులు చేయాలి. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకొనేలా చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో క్లినిక్‌లను బలోపేతం చేసుకోవాలి’’ అన్నారు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి.
‘‘బిహార్‌లో లాక్డౌన్ మరికొన్ని రోజులు పొడిగిస్తాం. ఒకసారి లాక్డౌన్ ఎత్తివేస్తే, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున బిహార్‌కు వస్తారు. అప్పుడు కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది’’ -బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. ‘‘మా రాష్ట్రానికి అత్యవసరంగా ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్ కిస్ట్ అవసరం ఉంది. అదే విధంగా రాష్ట్రానికి రూ.3వేల కోట్ల విలువైన మెడికల్ పరికరాలు కావాలి. అదే విధంగా వలస కూలీలను తరలించేందుకు మరో రూ.2,500కోట్లు అవసరం. మే 31 వరకూ చెన్నైకు రైళ్లు, విమాన రాకపోకలు అనుమతించవద్దు’’ – అని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య నీటి యుద్ధం