Wednesday, April 21, 2021

Latest Posts

వెయ్యి రూపాయలు ఇవ్వాలంటున్న సి.ఎమ్ జగన్

CM YS Jagan Decision Over Providing 1000 Rs For Poor Families

రేషన్‌ తీసుకున్న ప్రతి కుటుంబానికి  వెయ్యి రూపాయలు ఇవ్వాలని, ఎవ్వరూ పస్తులు ఉండకుండా చూడాలని మంగళవారం జరిగిన మీటింగ్ లో సి.ఎమ్.జగన్ అదికారులతో అన్నారు.  గురువారం నుండి రెండవ విడత రేషన్ పంపిణీ కూడా విజయవంతమగా నిర్వహించాలి అని ఆయన అన్నారు. అర్హత ఉండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వారంలోగా కార్డులు అందించాలని అలాగే వారికి కూడా రేషన్ అందేల చూడాలని అదికారులకు సూచించారు.

రాష్ట్రంలో ఎవ్వరూ పస్తులు ఉండకుండా చూసుకోవాలని కరోనా నియంత్రణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో సీఎం వారికి తెలిపారు. రెడ్‌ జోన్స్లో వైరస్‌ నియంత్రణ కోసం తీసుకుంటోన్న చర్యలు, అమలవుతోన్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ ఆరోగ్య సర్వే సమగ్రంగా జరిగేల చూడాలని ఆయన సూచించారు.

అన్నీ ఆసుపత్రిలో ఐసోలేషన్‌ సదుపాయం అందుబాటులో ఉండాలని, రోగికి జాగ్రత్తగా వైద్యం అందించే విధంగా చూడాలని పేర్కొన్నారు. క్వారంటైన్‌ పూర్తై ఇంటికి వెళ్లిన వారిపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఎల్లప్పుడూ పీపీఈలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వైఎస్‌ జగన్ సూచించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss