Sunday, May 16, 2021

Latest Posts

సలాం ఫ్యామిలీ సూసైడ్ పై స్పందించిన జగన్‌

నంద్యాలలో మైనార్టీ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ రంగును పులుముకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఈ కేసుపై స్పందిస్తూ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం బాధను కలిగించిందని ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను అరెస్ట్ చేశామన్నారు. టీడీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ఒక లాయర్ బెయిల్ పిటిషన్ వేశారని. బెయిల్ రద్దు చేయాలని తాము కోర్టుకు వెళ్లామన్నారు. అయితే న్యాయం ఎవరికైనా ఒకటేనని. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామని చెప్పారు. కావాలనే కొందరు ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు వేధించారని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పోలీసుల తీరును వివరిస్తూ సెల్పీ వీడియో షూట్ చేశాడు. కుటుంబం సామూహిక ఆత్మహత్య తర్వాత వీడియో పోలీసులకు లభించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. సోమశేఖర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను కోర్టులో హాజరుపరచగా నంద్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు వారం రోజులు రిమాండ్ విధించింది.

ఇది కూడా చదవండి:

 

 

 

 

 

 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss