ఏపి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను రాష్ట్ర సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు శుక్రవారం కలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకుని అరగంటకు పైగా భేటీ అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్ గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తారు. దీంతో పాటు త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ తో చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలుతో పాటు వివిధ అంశాల్లో ప్రభుత్వ పనితీరును గవర్నర్ కు నివేదించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఈసీ వ్యవహారం కూడా సీఎం జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళతారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: