Sunday, June 20, 2021

Latest Posts

కోవిడ్ తో కన్ను మూసిన మరో స్టార్ కమెడియన్

Comedian Pandu Passed Away
అనేక చిత్రాలలో హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు పాండు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవల కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో పాండు, అతని భార్య చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే చికిత్సకు ఆయన స్పందించకపోవడంతో ఈ రోజు ఆయన మరణించారు. అతని భార్య ప్రస్తుతం ఐసియులో ఉంది.

74 సంవత్సరాల నటుడు పాండును ఆసుపత్రి నుండి నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లనున్నారు. తరువాత దహన సంస్కారాలు బెసంత్ నగర్ లో జరగనున్నాయి.

తమిళ చిత్రం ‘కారైయెల్లం షెన్మాబాగపూ’ లో తొలిసారిగా అడుగుపెట్టిన ఇతను తరువాత రజనీకాంత్, విజయ్, అజిత్ మరియు తమిళ సినిమాలోని అనేక మంది స్టార్ హీరోలతో కలిసి నటించాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss