తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ప్రాణ స్నేహితుడు, కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సుధాకర్ గారు గుర్తున్నారా? గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బయట కానీ సినిమా ఫంక్షన్స్ లో కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కప్పుడు బిజీ షెడ్యూల్ తో తెగ సినిమాలు చేసేవారు. హీరోగా, కమెడీయన్ గా, నిర్మాతగా చాలా సినిమాలు చేశారు. అయితే ఆయనను బయట చూడక చాలా కాలమైంది.
రెండు సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుధాకర్ గారు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ మాయమైపోయారు. అయితే రీసెంట్ గా సుధాకర్ గారికి సంబంధించిన కొన్ని వీడియోస్ బయటికొచ్చాయి. ఈ వీడియో లో అతను వోట్ వేసి తిరిగి వస్తున్నారు. ఈ వీడియో లో అతని ఆరగ్యోం కాస్త నలత చెందినట్టు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన అతని అభిమానులు మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది సార్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంత మంది మీరు కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో, మళ్ళీ మా ముందుకు రావాలని భగవంతున్ని కోరుకుంటున్నాము అని కామెంట్స్ పెడుతున్నారు.
ఇది కూడా చదవండి: