Sunday, February 28, 2021

Latest Posts

ప్ర‌ముఖ నిర్మాత ఏక్తాక‌పూర్‌పై కేసు నమోదు

బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత ఏక్తాక‌పూర్‌పై కేసు న‌మోదైంది. తాను రూపొందించిన అన్ సెన్సార్డ్‌ సీజ‌న్ 2లో ఆర్మీని త‌ప్పుగా చూపించార‌ని ఆరోపిస్తూ సైబ‌ర్ క్రైం విభాగంలో విశాల్ కుమార్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశాడు. వివ‌రాల‌లోకి వెళితే అన్ సెన్సార్డ్‌ సీజ‌న్ 2 త్వ‌ర‌లో ప్రారంభం కానుండ‌గా, దీనికి సంబంధించిన ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఇందులో ఆర్మీ దుస్తులను, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీక‌రించార‌ని అలానే ఓ ఆర్మీ అధికారి భార్యకు, వేరే వ్యక్తికి ఉన్న సంబంధాలున్న‌ట్టు త‌ప్పుగా చూపించార‌ని విశాల్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు.

విశాల్ కుమార్ ఫిర్యాదుని స్వీక‌రించిన పోలీసులు పూర్తి వివ‌రాల‌ని పరిశీలించాక కేసు న‌మోదు చేస్తామ‌ని పేర్కొన్న‌ట్టు తెలుస్తుంది. 44 ఏళ్ల ఏక్తా క‌పూర్ 1994లో ఏర్పాటు చేసిన బాలాజీ టెలిఫిలీంస్‌కు ఆమె క్రియేటివ్ హెడ్‌గా జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీకి ఏక్తా కపూర్ చేస్తున్న సేవలకు గాను ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కరంతో సత్కరించిన విష‌యం తెలిసిందే.

ఇది కూడా చూడండి: హైదరాబాద్ లో మళ్ళీ కనిపించిన చిరుత

ఇది కూడా చదవండి: ఎన్‌టి‌ఆర్ త్రివిక్రమ్ మూవీలో సంజయ్ దత్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss