Thursday, May 13, 2021

Latest Posts

భీష్మ మూవీపై హెచ్ ఆర్ సి కి పిర్యాదు

Complaint to HRC on Bhishma Movie:

యువ హీరో  నితిన్ కి లేక లేక ఓ హిట్ దొరికింది. నితిన్  టైటిల్ రోల్‌ పోషిస్తూ, నటించిన చిత్రం ‘భీష్మ’ చిత్రం ఆడియన్స్ కి బానే కనెక్ట్ అయింది.  రష్మికా మందన్నా హీరోయిన్ గా చేసిన ఈ మూవీ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై, పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. అయితే తాజాగా ఈ చిత్రంపై మానవ హక్కుల కమీషన్‌కు గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్  ఫిర్యాదు చేశారు. గతంలో ఒకసారి ఈ మూవీపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ఇప్పుడు హెచ్ ఆర్ సికి చేసారు.

భీష్మ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అలాంటి సన్నివేశాలను వెంటనే తొలగించాలని  మానవ హక్కుల కమీషన్‌కు రాజేశ్వర్ ఫిర్యాదు చేశారు. సినిమా విడుదలై 20రోజులకు పైగా పూర్తయిన తర్వాత ఇటువంటి ఫిర్యాదుతో చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. దీనిపై  చిత్రయూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో మరి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss