Thursday, December 2, 2021

Latest Posts

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన జాలర్లు

Concerned fishermen across the Tamilnadu state

కేంద్రప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన చేపలవేట సవరణ చట్టం 2021 పై పెద్ద దుమరామే రేగుతుంది.  తాజాగా ప్రతిపాదించిన చేపలవేట సవరణ ను వెంటనే ఉపసహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడులో  సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జాలర్లు రోడ్డెక్కి తమ నిరసన తెలిపారు. ఈ ప్రతిపాదించిన చేపలవేట సవరణ చట్టంలో జాలర్ల 12 నాటికన్‌ మైళ్ల దూరంలో మాత్రమే చేపలు వేటాడాలని, వారు ఏ చేపలు పడుతున్నాది ముందుగా అధికారులకు తెలియజెయ్యాలని  ఒకవేళ తాము చెప్పిన చేపల కంటే ఇతర రకాలు వలలో పడితే వాటిని సముద్రంలోకి వదిలి వెయ్యాలని. ఈ  నిబంధనలు ఉల్లంఘిస్తే తొలిసారి జరిమానా, రెండవసారి జరిమానాతో పాటు జైలుశిక్ష, మూడోసారి పడవలు స్వాధీనంచేసుకోవలసింది పేర్కొన్నారు.

కాగా ప్రతిపాదించిన చేపలవేట సవరణ చట్టం 2021 చేపల వృత్తిపై ఆధారపడే లక్షలాది కుటుంబాల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఈ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని జాలర్లు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తు మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేసారు.  చెన్నై, కడలూరు, నాగపట్టినం, తిరునల్వేలి, కన్నియా కుమారి, తూత్తుకుడి, రామేశ్వరం జిల్లాల్లో కొందరు జాలర్లు ప్ల కార్డులతో సముద్రతీరంలో మానవహారం చేపట్టడంతో పాటు పడవలకు నల్లజెండాలు కట్టి వారి  నిరసన తెలిపారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss