Wednesday, April 21, 2021

Latest Posts

ఆపరేషన్ కమల్ కాదు, ఆపరేషన్ మనీ బ్యాగ్

Congress accuses BJP of trying to topple MP govt:

ప్రపంచమంతా కరోనా భయంతో ఒణికిపోతుంటే,  మధ్యప్రదేశ్ రాజకీయాలు మాత్రం ఫుల్ వేడెక్కిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపి, తమ సర్కారును పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడుతోంది. ఒక్కో ఎమ్మెల్యేకు 25 నుంచి 35 కోట్లను ఆఫర్ చేసి తమవైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.కమల్‌నాథ్ ప్రభుత్వంపై బీజేపీ కన్ను వేసిందని, ఇప్పటికే కాంగ్రెస్ నేతలపై హార్స్ ట్రేడింగ్ నడుస్తోందని పలు వార్తలు వస్తున్నాయి.

HAND_CONGRESS_PARTY_ELECTION_LOGO

అయితే  కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజాగా స్పందిస్తూ,  త్వరలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోనుందని వస్తున్న వార్తలు అవాస్తవమని, వాస్తవానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పారు.  ‘‘ఇది ఆపరేషన్ కమల్ కాదు, ఆపరేషన్ మనీ బ్యాగ్. పెద్ద పెద్ద సంచుల్లో డబ్బులు తెచ్చి ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారు. అయినా మా ప్రభుత్వానికి (కమల్‌నాథ్ ప్రభుత్వానికి) ఎలాంటి ఎలాంటి సమస్యా లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకే నేను ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని చెబుతున్నాను. మా ప్రభుత్వం నూరు శాతం క్షేమంగా ఉంది’’ అని అన్నారు.

కాగా బీజేపీ అధికార ప్రతినిధి మధుసూదన్ మాత్రం కాంగ్రెస్ ఆరోపణలను,అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బెంగుళూరుకి కాంగ్రెస్ ఎంపిలను తరలించారన్న వార్తలను   ఖండిస్తున్నారు. ‘‘పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలో చేరినట్లు, వారు బెంగళూరుకు చేరినట్లు వార్తలొస్తున్నాయి. అయితే వారు నిజంగా బెంగళూరుకు వచ్చారా అన్నది మాత్రం నాకు తెలియదు. సమాచారం లేదు.’’ అని మధుసూదన్ తెలిపారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss