Saturday, January 23, 2021

Latest Posts

రేవంత్‌రెడ్డి సలహాలు సూచనలు

Congress leader Revanth Reddy made some suggestions to the TS government

దక్షిణకొరియా తరహాలో ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానం అమలు చేయాలని,  లాక్‌డౌన్,సెల్ఫ్ క్వారంటైన్ శాశ్వత పరిష్కారం కాదని,ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే నని తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి  కొన్ని సూచనలు చేశారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చే నిధుల్లో పారదర్శకత లేదని, కొనుగోలు ఒప్పందాల పేరుతో సేకరిస్తున్న నిధుల్లో   చీకటి కోణం ఉందని ఆరోపించారు. కరోనాకు ప్రభుత్వం చేసిన ఖర్చు 2వేల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినవేనని కరోనా కోసం ప్రభుత్వం ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని తప్పుబట్టారు.

కొన్ని రాష్ట్రాలలో సీఎంలు ప్రతిపక్షనేతతో కలిసి కరోనాపై సమీక్షలు చేస్తున్నారని, ఇక్కడి సీఎం  ప్రతిపక్షాల సలహాలు ఎందుకు తీసుకోరు అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు నెలకు రూ.7500 చొప్పున 3 నెలలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ మేరకు దాదాపుగా 22 కోట్లు ఖర్చవుతుందని, ధనిక రాష్ట్రానికి ఇది సమస్య కాదన్నారు. మూడు నెలల విద్యుత్, నల్లా బిల్లులు పేద, మద్య తరగతి కుటుంబాలకు రద్దు చేయాలని కోరారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss