Tuesday, January 25, 2022

Latest Posts

ఈటల గెలుపు ఖాయమంటున్న కాంగ్రెస్‌ ఎంపీ

Congress MP comments on huzurabad election

హుజూరాబాద్‌ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి తాను సర్వే చేయించగా 67 శాతం ఓట్లు ఈటల రాజేందర్‌కు, 30 శాతం తెరాసకు, కాంగ్రెస్‌కు అయిదు శాతం లోపే పడేటట్లు ఉన్నాయని దిల్లీలోని తెలంగాణ భవన్‌లో బుధవారం విలేకరులకు తెలిపారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.  త్వరగా హుజూరాబాద్‌కు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించి పార్టీ ప్రచారం, కార్యక్రమాలు వేగవంతం చేస్తే మార్పు వచ్చ అవకాసం ఉందని తెలిపారు. తెలంగాణాలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని, ఆ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్‌ జాగ్రత్తపడాల్సి ఉందని, నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడమే ప్రస్తుతం తన లక్ష్యమన్నారు.  కాగా తమ హయాంలో ప్రారంభించిన ఎస్సెల్బీసీ టన్నెల్‌, ఇతర ప్రాజెక్టుల పనులు ఇప్పటి వరకు పూర్తి చెయ్యలేదని, అవి పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందనే భయంతోనే వాటిని పూర్తి చెయ్యడం లేదని అన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss